హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ(ఎన్‌డబ్ల్యూడీఏ)77వ జనరల్ బాడీ సమావేశాన్ని అక్టోబర్1న నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని రాష్ర్టాలకు అథారిటీ సమాచారం అందించింది. ఢిల్లీ వేదికగా హైబ్రీడ్మోడ్లో సమావేశాన్ని నిర్వహించనున్నారు. గతేడాదిగా ఎన్‌డబ్ల్యూడీఏ సాధించిన ప్రగతి, తీసుకున్న నిర్ణయాలపై చర్చించనున్నారు.
గౌడ్లపై దాడులు హేయం ; గౌడ ఐక్య సాధన సమితి ఫైర్
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని గౌడ్లపై దాడులు హేయమని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాళ్లరాంపూర్‌లో కల్లుగీత వృత్తిదారుల ఈత వనాలను ధ్వంసం చేసి, గౌడ్లపై దాడులకు పాల్పడిన వీడీసీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడికి వ్యతిరేకంగా వారం రోజులుగా నిరసన తెలిపుతున్న గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నం నారాయణగౌడ్‌ను నిర్మల్ పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు.