రాయ్‌పూర్, మే 17: ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో దొంగలు కాంగ్రెస్ ఆఫీస్‌ను టార్గెట్ చేసుకున్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి చొరబడిన దొంగలు బాత్రూమ్లోని దాదాపు 70కిపైగా స్టీల్ నల్లాలను, ఇతర పరికరాలను ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా వెళ్లేటప్పుడు నేలపై ‘ఐ లవ్ యూ అంబికాపూర్’ అని దొంగలు రాయటం వార్తల్లో నిలిచింది. గాంధీచౌక్ సమీపంలోని రాజీవ్ భవన్లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇదొకటి. ఈ ఆఫీస్‌లో దొంగతనం జరగటం ఇది మూడోసారి. ఈ ఘటనపై జిల్లా కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగలు ప్రేమ సందేశం రాశారంటే నగరంలోని శాంతిభద్రతలను ఎగతాళి చేయడమేనని మండిపడ్డారు. పోలీసుల రాత్రి పెట్రోలింగ్ కేవలం కాగితాలకే పరిమితమైందని కాంగ్రెస్ విమర్శించింది.