Bhupalapally | జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. 7.44 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.
భూపాలపల్లిలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. దీంతో కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ. 1.86 లక్షలు ఉంటుందని ఎస్పీ కరుణాకర్ వెల్లడించారు. నిందితులను భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన కంది సాయికిరణ్, మందల కల్యాణ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.