హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : దసరా, దీపావళి నేపథ్యంలో తెలంగాణలోని సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ రైల్వేతోపాటు ఏపీలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలో 650 రైళ్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైళ్లు నవంబర్ చివరకు వరకు నడుస్తాయని పేర్కొన్నారు.
తిరుమలలో మళ్లీ చిరుత కలకలం ;సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. శ్రీవారిమెట్టు ప్రాంతంలోని కంట్రోల్ రూం వద్దకు రాత్రి చిరుత రావడంతో సెక్యూరిటీ సిబ్బంది భయంతో లోనికి వెళ్లి తాళాలు వేసుకున్నారు. వెంటనే అప్రమత్తమై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రెండు రోజులుగా రాత్రి 10 నుంచి ఉదయం 5గంటల సమయంలో చిరుత శ్రీవారి మెట్టు ప్రాంతంలో సంచరించినట్టు అటవీ అధికారులు గుర్తించారు.