హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు భారీగా నమోదవుతున్నాయి. మార్చి మొదటివారం నుంచి ఏప్రిల్ 26 వరకు మొత్తం 6,366 కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. వీటిల్లో గరిష్ఠంగా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కేసులు 5,967 నమోదయ్యాయి. నార్కోటిక్/డ్రగ్స్ కేసులు 104, ఐపీసీ కేసులు 274, ప్రజాప్రాతినిధ్య చట్టం కేసులు 21 ఉన్నాయి.