హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): ‘న్యూ ఇయర్ డే’ను పురస్కరించుకొని రాష్ట్ర హోంశాఖ 636 మందికి పోలీసు పలు సేవా పతకాలను సోమవారం ప్రకటించింది. రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, టీఎస్ఎస్పీ, అగ్నిమాపకశాఖ, రైల్వేఫోర్సుల్లోని విభాగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఈ పతకాలు వరించాయి.
అత్యత్తుమ సేవలందించిన ఏడుగురికి (పోలీసు 1, ఫైర్‌శాఖ 6) ‘తెలంగాణ రాష్ట్ర శౌర్య పతకం’ అందించనున్నారు. పతకం పొందిన ఏడుగురికి ప్రతినెలా వారి వేతనంలో రూ.500 ఇంక్రిమెంట్ కలువనున్నది. ‘తెలంగాణ రాష్ట్ర మహోన్నత సేవా పతకం’ 10 మందికి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఉత్తమ సేవా పతకం 104 మందికి అందించనున్నారు. కఠిన తెలంగాణ రాష్ట్ర సేవా పతకం 42 మందిని వరించింది. తెలంగాణ రాష్ట్ర సేవా పతకం 473 మందికి అందించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర శౌర్య సేవా పతకం పొందిన వారు
1. కే ఉపేందర్, జేసీ, గ్రేహౌండ్స్ అగ్నిమాపకశాఖలో..
2. బీ సుధాకర్‌రావు, డీడీ (ఆర్ఎఫ్వో) హైదరాబాద్
3. పీ రమేశ్ ఎస్ఎఫ్వో, మహేశ్వరం, రంగారెడ్డి
4. సీ నవీన్‌కుమార్, ఫైర్‌మెన్, జడ్చర్ల, మహబూబ్‌నగర్
5. పీ నాగయ్య, లీడింగ్ ఫైర్‌మెన్, హైదరాబాద్
6. ఆర్ ఆదర్శ్, ఫైర్‌మెన్ అసెంబ్లీ ఫైర్‌స్టేషన్, హైదరాబాద్
7. మహమ్మద్ ఇజాజ్, ఫైర్‌మెన్, అసెంబ్లీ ఫైర్‌స్టేషన్, హైదరాబాద్