Congress ఇది తెలంగాణ రైతులు సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయం. కాంగ్రెస్ నేతలు చెప్తున్న మాటలు నమ్మితే వ్యవసాయరంగ భవిష్యత్తు ఏమవుతుందో విభిన్న కోణాల్లో లోతుగా ఆలోచించాల్సిన సందర్భం. కాంగ్రెస్ నేతలు చెప్తున్న 3 గంటల కరెంటు కోసం 10 హెచ్‌పీ మోటర్లను బిగించుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. అది రైతులకు, ప్రభుత్వానికి మోయలేని భారంగా మారుతుంది. వ్యవసాయరంగం మరోసారి భయంకరమైన సంక్షోభంలోకి కూరుకుపోతుంది. మళ్లీ వలస బతుకులే దిక్కవుతాయి.
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతాంగమా.. పారా హుషా ర్.. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రస్తుతం పండుగలా ఉన్న వ్యవసాయం వచ్చే ఐదేండ్లలో తిరిగి దండుగలా మారడం ఖాయం. కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టుగా రైతులు వ్యవసాయానికి ఉపయోగిస్తున్న 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్ల స్థానంలో 10 హెచ్‌పీ మోటర్లను బిగించుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇం దుకోసం రాష్ట్ర రైతాంగం, ప్రభుత్వం మీద రూ.60 వేల కోట్ల భారం పడుతుంది.
రాష్ట్రం లో ఉన్న 28 లక్షల వ్యవసాయ కనెక్షన్లను 10 హెచ్‌పీ మోటర్లుగా మార్చడానికి మోటర్లు, పైపులు, క్లాంప్లు, వైర్లు, స్టార్టర్, డబ్బాలు, మెకానిక్, కూలీల ఖర్చులన్నీ కలిపి తెలంగాణ రైతాంగంపై రూ.30 వేల కోట్ల భారం పడుతుంది. 10 హెచ్‌పీ మోటర్లను నడిపేలా ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను బలోపేతా నికి ప్రభుత్వం మరో రూ.30 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈలెక్కన 10 హెచ్‌పీ మోటరు పంపులకు కావాల్సిన ఈ వ్యవస్థ సిద్ధం చేసేందుకు రూ.60 వేల కోట్లు కావాలి. పైగా ఇందుకు ఐదేండ్లు పడుతుంది. దీంతో పండుగలా ఉన్న వ్యవసాయం తిరిగి 2014కు ముందునాటి ‘దండగ’లా మారుతుందని విద్యుత్తు రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వ్యవస్థల బలోపేతం అతి ముఖ్యం
ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్తును అందిస్తున్నది. 28 లక్షల మంది రైతులు 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లు వాడుతున్నారు. కొందరు 7.5 హెచ్‌పీ మోటర్లను ఉపయోగిస్తున్నారు. కాం గ్రెస్ నేతలు చెప్తున్నట్టుగా వ్యవసాయానికి 3 గంటల విద్యుత్తును సరఫరా చేస్తే రైతులు 10 హెచ్‌పీ మోటర్లను బిగించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లను నడిపించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది కలగకుం డా వ్యవస్థలను నిర్మించారు. వీటిని తీసేసి 10 హెచ్‌పీ మోటర్లను అమర్చుకోవాలంటే డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. విద్యుత్తు రంగ నిపుణుల అంచనా ప్రకారం.. ప్రస్తుతం ట్రాన్స్‌కో పరిధిలో ఉన్న 40,640 ఎంవీయే ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని మరో 20-25% అంటే 50,000 ఎంవీఏకు పెంచాల్సి వస్తుంది.
డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను కూడా 50-60% వరకు అదనంగా బలోపేతం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం డిస్కంల పరిధిలో ఉన్న 8.72 లక్షల డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మ్ (డీటీఆర్)లలో కనీసం 5 లక్షల డీటీఆర్లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది.
ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను బలోపేతానికి రూ.30 వేల కోట్ల వరకు ఖ ర్చు చేయాల్సి ఉంటుంది. ఇదంతా ప్రభు త్వం మీద పడబోయే అదనపు భారం.
మొత్తం రూ.60 వేల కోట్లు
10 హెచ్‌పీ మోటర్ల కొనుగోలుకు రైతులపై పడే భారం రూ.30 వేల కోట్లు కాగా, అందుకు అనుగుణంగా వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం పై పడే భారం మరో రూ.30 వేల కోట్లు. కాం గ్రెస్ నేతలు చెప్తున్న నూతన పథకం అమల్లోకి రావాలంటే అటు రైతులపై, ఇటు ప్రభుత్వంపై పడే భారం అక్షరాలా రూ.60 వేల కోట్లు. పోనీ దీనివల్ల రైతులకుగానీ, ప్రభుత్వానికిగానీ ఏమన్నా ఆదాయం పెరుగుతుందా? అంటే అదీ లేదు. రైతులు సాగుచేసే పంటల ఉత్పాదకతలో, పంటల దిగుబడిలో ఎలాంటి మెరుగుదల ఉండదు. ఇన్ని వేల కోట్లు ధారపోసినా రైతుల ఆదాయం కానీ, ప్రభుత్వం ఆదాయం కానీ నయా పైసా పెరగదు. దీంతో రైతులు, ప్రభుత్వం కలిపి పెట్టే ఖర్చు రూ.60 వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరవుతుంది.
40 వేల కోట్లు ఖర్చుచేసిన రాష్ట్ర సర్కారు
2014కు ముందు సాగుకు 6 గంటల విద్యుత్తును అందిస్తున్నామని చెప్పిన అప్పటి కాం గ్రెస్ ప్రభుత్వం.. పగటిపూట 3 గంటలు, రాత్రిపూట మరో 3 గంటల విద్యుత్తును అది కూడా నాలుగైదు విడతలుగా సరఫరా చేసేది. ఏక బిగిన 6 గంటలపాటు విద్యుత్తును అందించే లా అప్పటి ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు ఉండేవి కావు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ సారథ్యంలో ఆరు నెలల్లోనే 9 గంటలపాటు రాష్ట్రమంతటా నిరంతరాయం గా విద్యుత్తును 19 లక్షలకుపైగా ఉన్న వ్యవసాయ కనెక్షన్లకు అందించేలా తాత్కాలికంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత 2018 జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల విద్యుత్తును అందించేలా ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను బలోపేతం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు పెట్టింది.
విద్యుత్తు వ్యవస్థలను బలోపేతం చేయడానికి అంత డబ్బుతోపాటు నాలుగున్నర ఏండ్ల సమయం పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్తుశాఖ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తేనే అది సాధ్యమైంది. ఆ వ్యవస్థలను 10 హెచ్‌పీ మోటర్లను ఉపయోగించేలా మరింత బలోపేతం చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే, మనకు కావాల్సిన పవర్ ట్రాన్స్ఫార్మర్లను, డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లను డిజైన్ చేసి, వాటి సామర్థ్యాలను బట్టి దేశవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ల తయారీ కంపెనీలకు ఆర్డర్ ఇవ్వాలి. ఆయా కంపెనీలు వాటిని తయారు చేయడానికి సంవత్సరాలు పడుతుంది. వీటిని తీసుకొచ్చి బిగించడానికి మరికొంత సమయం కావాలి. ఎంత వేగంగా చేసినా కనీసం ఐదేండ్లు పడుతుందని నిపుణుల అంచనా.
ఇక వ్యవసాయం దండగే
కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టుగా 10 హెచ్‌పీ మోటర్లు బిగించి, అందుకు అనుగుణంగా విద్యుత్తు వ్యవస్థలను మార్చడానికి రూ.60 వేల కోట్లు, ఐదేండ్ల సమయం పడితే.. అప్పటికే వ్యవసాయం కుప్పకూలుతుంది. మళ్లీ దండగ అనుకునే పరిస్థితి వస్తుంది. సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంటు, రైతుబంధు ఇస్తుండటంతోపాటు కొత్త ప్రాజెక్టులతో భూగర్భ జలాలు భారీగా పెరిగి రాష్ట్రంలోని 28 లక్షల వ్యవసాయ మోటర్లు నిర్విరామంగా నడుస్తున్నాయి. దీనితో రైతులు రెండేసి పంటలను పండిస్తున్నారు. తెలంగాణ దేశానికే అన్నంపెట్టే స్థాయికి ఎదిగింది.
పంజాబ్‌ను తలదన్ని 2022-23 వ్యవసాయ సీజన్లో మొత్తం 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించారు తెలంగాణ రైతాంగం. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మితే.. ఐదేండ్ల పాటు వ్యవసాయం కునారిల్లుతుంది. బీడుభూములు పెరుగుతాయి. పంటల దిగుబడి పడిపోతుంది. రైతులకు అప్పులే మిగులుతాయి. బతకడానికి మళ్లీ వలసల బాటన పట్టాల్సిన దుస్థితి దాపురిస్తుంది. ముంబై, దుబాయి, బొగ్గుబాయి వైపు వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఆ బాధలు మళ్లీ అవసరమా? తెలంగాణ రైతులు సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయమిది.
కాంగ్రెస్‌కు ఓటేస్తే ఏమైతది?