జిన్నారం (బొల్లారం) జనవరి 20: సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో శ్రీకర ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో అకడ పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
వీరిలో ఈశ్వర్ చంద్ర అగరియా పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సీఐ రవీందర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.