హైదర్‌గూడలో అదృశ్యమైన బాలుడి ఘటన విషాదంతం
Hyderguda | నగర శివార్లలోని హైదర్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. హైదర్‌గూడలోని సిరిమల్లె కాలనీకి చెందిన అన్వేశ్ అనే ఆరేండ్ల బాలుడు గురువారం మధ్యాహ్నం

హైదరాబాద్: నగర శివార్లలోని హైదర్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. హైదర్‌గూడలోని సిరిమల్లె కాలనీకి చెందిన అన్వేశ్ అనే ఆరేండ్ల బాలుడు గురువారం మధ్యాహ్నం అదృశ్యమయ్యాడు. అయితే అతని మృతదేహం ఇంటి సమీపంలోని చెరువులో ప్రతక్ష్యమయింది. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఆడుకుంటూ.. బిల్డింగ్‌పై నుంచి కిందికి వచ్చాడు. అయితే సాయంత్రం అయినప్పటికీ అతడు తిరిగి రాలేదు.
దీంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికిన తల్లిదండ్రులు.. ఎంతకీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఇంటి సమీపంలో ఉన్న చెరువులో అతని మృతదేహాన్ని గుర్తించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా, అన్వేశ్ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అయితే రెండు రోజుల క్రితం బ్యాటరీ బైక్ కొనివ్వాలని అన్వేశ్ తన తండ్రిని కోరాడు. దీంతో ఆన్లైన్లో ఆడర్ పెట్టానని, రెండు రోజుల్లో వస్తుందని అన్వేశ్ తండ్రి అతనికి చెప్పాడు. కాగా, రెండు రోజులవుతున్నప్పటికీ బైక్ రాకపోవడంతో అతడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని స్థానికులు చెబుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

