6.59 లక్షల పాస్‌పోర్ట్‌ల జారీ
2022లో 6.59 లక్షల పాస్‌పోర్ట్‌లు జారీ చేసి హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయం రికార్డు సృష్టించింది. ఏడేండ్లలో నిరుడు అత్యధికంగా సేవలందించిన ఘనత పాస్‌పోర్ట్ కార్యాలయాలు దక్కించుకున్నాయి. హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య బుధవారం 2022-వార్షిక రిపోర్ట్‌ను విడుదల చేశారు.
- ఏడేండ్లలో ఇదే మొదటి సారి
- హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): 2022లో 6.59 లక్షల పాస్‌పోర్ట్‌లు జారీ చేసి హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయం రికార్డు సృష్టించింది. ఏడేండ్లలో నిరుడు అత్యధికంగా సేవలందించిన ఘనత పాస్‌పోర్ట్ కార్యాలయాలు దక్కించుకున్నాయి. హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య బుధవారం 2022-వార్షిక రిపోర్ట్‌ను విడుదల చేశారు. విభిన్న రకాల పాస్‌పోర్ట్ సేవలతో ఈ ఏడాది రూ.118 కోట్ల ఆదాయం ఆర్జించినట్టు వివరించారు. 2020, 2021లో కరోనా కారణంగా పాస్‌పోర్ట్ సేవలకు కొంత అంతరాయం ఏర్పడినా, సేవలందించడంలో విజయవంతమైనట్టు పేర్కొన్నారు.
దరఖాస్తుదారులకు సేవలందించడమే కాకుండా సామాజిక బాధ్యతలో భాగంగా పర్యావరణం, పరిశుభ్రత, దేశభక్తి, రక్తదానం తదితర అంశాలపై అవగాహన కల్పించే పలు రకాల కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో వేగాన్ని పెంచడం కోసం ప్రతీ శనివారం ప్రత్యేక పాస్‌పోర్ట్ డ్రైవ్‌లు చేపట్టామని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, పరిశోధకులు, ఇమ్మిగ్రెంట్స్‌కు ప్రత్యేక మేళాలు నిర్వహించి, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్స్ ప్రక్రియ సులభతరం చేశామని తెలిపారు. ప్రతీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ‘చాట్ విత్ ఆర్పీవో’ పేరుతో దరఖాస్తుదారులకు అందుబాటులో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

