హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : సాంఘిక సంక్షేమ గురుకు ల విద్యాసంస్థల సొసైటీలో 6 నెలల్లో 53 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొం దారు. విరమణ పొందే సమయంలో ఉ ద్యోగికి జీతం, సేవా వ్యవధి ఆధారంగా ఒకేసారి గ్రాట్యూటీ, పెన్షన్, కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ చెల్లించడంతోపాటు లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లింపులు చేయాల్సి ఉం టుంది. వివరాలన్నీ క్రోడీకరించి వాటి మంజూరు కోసం ఆ పత్రాలను ఏజీ(ఆడిటర్ జనరల్) కార్యాలయానికి సంబంధి త శాఖ అధికారులే సమర్పించాల్సి ఉం టుంది. ఏజీ ఆమోదం తరువాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు వెళ్లి అనుమతి పొందిన అనంతరం నిధుల విడుదలతోపాటు నెలవారీ పెన్షన్ కూడా మంజూరవుతుంది. ఉద్యోగి విరమణ పొందడానికి 6 నెలల ముందు నుంచే అన్ని శాఖల్లో అధికారు లు ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు.
కానీ, సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఆరు నెలలైనా విరమణ ఉద్యోగుల పెన్షన్ ప్రపోజల్స్ను సొసైటీ ఉన్నతాధికారులు ఏజీ కార్యాలయానికి పంపలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విషయాన్ని సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయిందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సొసైటీ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తమకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.