ఉట్నూర్, ఆగస్టు18: ఆదివాసులను కాల్చిచంపిన కాంగ్రెస్సే.. ఇప్పుడు ఇంద్రవెల్లిలో సభలు పెట్టడం విడ్డూరంగా ఉన్నదని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఎద్దేవాచేశారు. రేవంత్‌రెడ్డి సభ ద్వారా సామాన్య జనాలకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జాదవ్ శ్రీరాంనాయక్ 500 మంది అనుచరులతో కలిసి మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువా కప్పి మంత్రి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే ఏజెన్సీ అభివృద్ది కండ్ల ముందే కనిపిస్తున్నదన్నారు. 33 వేల ఎకరాలకు రైతుబంధు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారని తెలిపారు.