ఖైరతాబాద్, మే 10 : మనఊరు-మనబడి కార్యక్రమం కోసం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం ప్రొఫెసర్ భూక్యా బాబురావు రూ.5.5లక్షల విరాళం ప్రకటించారు. తాను చదువుకున్న పాఠశాలల అభివృద్ధి కోసం ఆయన ఈ విరాళాన్ని అందజేశారు. ములుగు జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన భూక్యా బాబురావు రామచంద్రాపురం, మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారు. రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాలకు రూ.4.5లక్షలు, మల్లంపల్లి ఉన్నతపాఠశాలకు లక్ష రూపాయల విరాళాన్ని చెక్కుల రూపంలో ఉపాధ్యాయులు సునీత, ఆగయ్యలకు ప్రొఫెసర్ బాబురావు అందజేశారు. మన ఊరు-మన బడి ముఖ్యమత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని పేర్కొన్నారు. సర్కారు బడులను తీర్చిదిద్దాలన్న ఆలోచన గొప్పదని, ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని ఆయన కోరారు.