హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందిరాపార్క్ వద్ద 48 గంటల దీక్ష చేపట్టిన సందర్భానికి బుధవారంతో పదేండ్లు పూర్తయ్యాయి. ఆ జ్ఞాపకాలను ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్లో పంచుకొన్నారు. ‘పదేండ్ల క్రితం ఇదే రోజున.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజయవంతంగా పోరాటం చేశాం’ అని పేర్కొన్నారు.
2012 ఏప్రిల్ 13 నుంచి 15 వరకు కవిత దీక్ష చేపట్టారు. ఆ సమయంలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తుండగా ట్యాంక్బండ్పైనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద కవితను పోలీసులు అరెస్టు చేశారు. కవిత దీక్షతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరగటంతో అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సమైక్య సర్కారు ప్రకటించింది.