మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 8: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కండ్లకోయ పరిధిలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో సీఎస్ఈ ఫైనలియర్ చదువుతున్న గ్రీష్మకు అమెజాన్ కంపెనీ భారీ ప్యాకేజీ ప్రకటించింది.
ప్రాంగణ నియామకాల్లో రూ.44 లక్షల వార్షిక వేతనానికి ఆమె ఎంపికైంది. శిక్షణ కాలంలో రూ.80 వేలు ఇచ్చేందుకు కంపెనీ అంగీకరించింది. గ్రీష్మను కళాశాల చైర్మన్ చామకూర గోపాల్‌రెడ్డి, కార్యదర్శి వసంత లత, సీఈవో అనురాగ్‌రెడ్డి, డైరెక్టర్ రాజిరెడ్డి, హెచ్‌వోడీ రాజు ప్రత్యేకంగా అభినందించారు.