హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : అక్రమంగా 425 కిలోల క్లోరల్ హైడ్రేట్, 1.115 కిలోల అల్ఫాజోలంను తరలిస్తున్న ఐదుగురిని తెలంగాణ నార్కోటిక్ పోలీసులు పట్టుకున్నారు. డీటీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర థానే జిల్లా గణేశ్పురి మండలం, నింబవాలి గ్రామంలో తయారు చేసిన క్లోరల్ హైడ్రేట్, అల్ఫాజోలం డ్రగ్‌లను రామగౌడ్ (45), బుర్ర రమేశ్ (36), కొట్టగిరి రాజం (59), ఎల్లండుల శ్రీనివాస్ (44), బుర్ర రాజశేఖర్ (34)లు అక్రమంగా తరలిస్తుండగా తెలంగాణ నార్కోటిక్, నిర్మల్ ఎక్సైజ్ పోలీసులు పోలీసులు పట్టుకున్నారు.
పట్టుబడిన మత్తుపదార్థాల విలువ రూ. 52 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా కొనసాగించిన ఎస్పీ రూపేశ్, డీఎస్పీ హరీశ్ చంద్రారెడ్డి, ఇన్స్పెక్టర్ పీ రమేశ్‌రెడ్డి, నిర్మల్ ఎక్సైజ్ పోలీసులను సందీప్ శాండిల్య అభినందించారు.