హైదరాబాద్, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ): ఏపీలోని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరలోని దేశ్ముఖి సమీపంలోని విజ్ఞాన్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్‌లలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చరల్, ఫార్మాడీ ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన వీశాట్ 2026 ఫేజ్ -1(విజ్ఞాన్ స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్)కు ఈ ఏడాది అనూహ్య స్పందన లభించిందని వర్సిటీ ఇన్చార్జి వీసీ కేవీ కృష్ణకిశోర్ తెలిపారు. వీశాట్ 2026 ఫేజ్ -1 ప్రవేశ ప రీక్ష ఫలితాలను శనివారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడు తూ.. దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల నుంచి 61 వేల మంది విద్యార్థులు వీశాట్ పరీక్షకు హాజరైనట్టు తెలిపారు.
ఇందులో 42వేల మంది వర్సిటీలో అడ్మిషన్ పొందడానికి అర్హత సా ధించినట్టు పేర్కొన్నారు. 50 లోపు ర్యాంకులు సాధించిన వారికి 50% స్కాలర్షిప్, 51 నుంచి 200లోపు ర్యాంకులు సాధించిన వారికి 25% స్కాలర్షిప్, 201 నుంచి 2000లోపు ర్యాంకులు సాధించిన వారికి 10% స్కాలర్షిప్ను నాలుగేండ్లపాటు అందజేస్తామని వెల్లడించారు. ఇంటర్లో 970కిపైగా మార్కులు సాధించిన విద్యార్థులకు 50% స్కాలర్షిప్, 950 నుంచి 969 మార్కులు సాధించిన విద్యార్థులకు 25%, 920 నుంచి 949 మార్కులు సాధించిన విద్యార్థులకు 10% స్కాలర్షిప్ అందజేస్తామని తెలిపారు.
85% పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగా లు కల్పిస్తామని పేర్కొన్నారు. జేఈఈ మెయిన్స్‌లో 95కిపైగా పర్సంటైల్ విద్యార్థులకు 75% స్కాలర్షిప్, 89 నుంచి 94.9 పర్సంటైల్ విద్యార్థులకు 50%, 80 నుంచి 88.9 పర్సంటైల్ విద్యార్థులకు 25%, 70 నుంచి 79.9 పర్సంటైల్ విద్యార్థులకు 10% స్కాలర్షిప్ అందజేస్తామని తెలిపారు. గుంటూరు, హైదరాబాద్ క్యాంపస్‌ల్లో ప్రవేశాలకు ఈ నెల 22 నుంచి 27 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు.