హైదరాబాద్, నవంబర్29 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ఓబీసీ జాబితాలో లేకుండా పోయిన 40 కులాలను వెంటనే కలిపేందుకు చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్ర బీసీ కమిషన్ తీర్మానించింది. ఇటీవల బహిరంగ విచారణల్లో వినతులపై ఖైరతాబాద్‌లోని కార్యాలయంలో కమిషన్ శుక్రవారం సమీక్షించింది. రాష్ట్ర బీసీ జాబితాలో 130 కులాలు ఉండగా, కేంద్ర ఓబీసీ జాబితాలో రాష్ర్టానికి చెందిన 90 కులాలు మాత్రమే ఉన్నాయని, మిగతా 40 కులాలను చేర్చేందుకు వివిధ సంఘాలు ఇచ్చిన వినతులపై కమిషన్ చర్చించింది.