జేఈఈ నుంచి 4 పట్టణాలు ఔట్.. ఎన్టీఏ తీరుపై విద్యార్థులకు తప్పని కష్టాలు
జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. జేఈఈ పరీక్షలు నిర్వహించే పట్టణాల జాబితా నుంచి రాష్ట్రంలోని ఆదిలాబాద్, గద్వాల, మంచిర్యాల, వికారాబాద్ కేంద్రాలను తొలగించింది.
- ఆదిలాబాద్, గద్వాల, మంచిర్యాల, వికారాబాద్ తొలగింపు
హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. జేఈఈ పరీక్షలు నిర్వహించే పట్టణాల జాబితా నుంచి రాష్ట్రంలోని ఆదిలాబాద్, గద్వాల, మంచిర్యాల, వికారాబాద్ కేంద్రాలను తొలగించింది. గత ఏడాది రాష్ట్రంలో 21 పట్టణాల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించగా, ఈ ఏడాది 17 పట్టణాలకే పరిమితం చేసింది. ఆదిలాబాద్ నుంచి పరీక్ష రాసే వారు ఇకనుంచి నిజామాబాద్ లేదా హైదరాబాద్లో, వికారాబాద్ అభ్యర్థులు హైదరాబాద్ లేదా సంగారెడ్డిలో, గద్వాల అభ్యర్థులు 95 కిలోమీటర్లు ప్రయాణించి మహబూబ్నగర్లో పరీక్షలు రాయాల్సిన పరిస్థితిని ఎన్టీఏ తీసుకురావడంపై పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
గతంలో జేఈఈ మెయిన్ పరీక్షల పట్టణాలు
ఆదిలాబాద్, గద్వాల, హయత్నగర్, హైదరాబాద్/సికింద్రాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట,
వికారాబాద్, వరంగల్.
ఈ ఏడాది పరీక్షలు నిర్వహించే పట్టణాలు
హయత్నగర్, హైదరాబాద్/సికింద్రాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్నగర్, మెదక్, మేడ్చల్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.
కఠినమైన పరీక్షకు ట్రావెల్ వద్దు
జేఈఈ మెయిన్ ప్రపంచంలోనే రెండో కఠినమైన పరీక్షగా ఇటీవలే వెల్లడైంది. ఇలాంటి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కాస్త ప్రశాంతత అవసరం. పరీక్షలకు ముందు అత్యధిక దూరం ట్రావెల్ చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా వీటన్నింటిని ఎన్టీఏ పట్టించుకోకపోవడం దారుణమని పలువురు పేర్కొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

