హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఈ నెలంతా ఉద్యోగాల భర్తీ పరీక్షలు జరగనున్నాయి. ఒక్క నెలలోనే 15 పరీక్షలు జరుగుతుండటం విశేషం. 4న పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల పరీక్షతో ప్రారంభమై, 29న జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల పరీక్షలతో ముగియనున్నాయి. ఇప్పటికే పాలిటెక్నిక్ పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రంలో 19 విభాగాల్లో 247 పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి 4 నుంచి 8 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రోజూ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు వేర్వేరు సబ్జెక్టులకు దరఖాస్తు చేస్తే, ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేకంగా హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ పేర్కొన్నది.
పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్షలు
పరీక్ష తేదీ సబ్జెక్టు
జూనియర్ లెక్చరర్