హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) రెండో విడత పరీక్షలు ఈ నెల 4 నుంచి ప్రారంభిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులు తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కోసం నిర్వహించే ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 6.80లక్షల విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను https ://cuet. samarth.ac.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. బిట్‌శాట్, నాటా, ఎంహెచ్టీసీఈటీ ఎగ్జామ్స్ కారణంగా హాజరుకాలేని విద్యార్థులకు ఈ నెల 12,13,14న పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించారు.
సెప్టెంబర్‌లో సీయూఈటీ (పీజీ)
కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ – పీజీ (సీయూఈటీ) పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహించనున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు మొదటి విడత, సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు రెండో విడత పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.