న్యూరో సర్జరీకి 3డీ కపాలం
న్యూరో సర్జరీలో తలెత్తే ఇబ్బందులు, యువ న్యూరో సర్జన్లకు వర్చువల్, 3డీ బేస్డ్ విధానంలో శిక్షణ ఇచ్చేందుకు 3డీ ఎండోస్కోపిక్ కపాలాన్ని హైదరాబాద్ వేదికగా ఆవిష్కరించనున్నారు. 3డీ మాడల్ సాంకేతికతను అందించే వన్ ఇమర్సివ్ సంస్థతో కలిసి టీ వర్క్స్‌లో దీన్ని రూపొందించనున్నారు.
- త్వరలో హైదరాబాద్‌లో ఆవిష్కరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): న్యూరో సర్జరీలో తలెత్తే ఇబ్బందులు, యువ న్యూరో సర్జన్లకు వర్చువల్, 3డీ బేస్డ్ విధానంలో శిక్షణ ఇచ్చేందుకు 3డీ ఎండోస్కోపిక్ కపాలాన్ని హైదరాబాద్ వేదికగా ఆవిష్కరించనున్నారు. 3డీ మాడల్ సాంకేతికతను అందించే వన్ ఇమర్సివ్ సంస్థతో కలిసి టీ వర్క్స్‌లో దీన్ని రూపొందించనున్నారు. యువ సర్జన్లలో నైపుణ్యాలను పెంచేలా వర్చువల్ సిమ్యులేటర్‌ను తయారు చేయనున్నట్టు హైదరాబాద్ న్యూరో సర్జన్ల బృందం వెల్లడించింది. ప్రొడక్ట్ డిజైన్ ఇంజినీర్లు, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరో సర్జన్ల బృందం కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు వివరించింది.
తొలి స్వదేశీ 3డీ కపాలం ఇదే
టీవర్క్స్‌లో తయారుకానున్న తొలి స్వదేశీ 3డీ కపాలం ఇదే కానున్నది. వన్ ఇమర్సివ్ టెక్నాలజీకి చెందిన ప్రొడక్ట్ డిజైన్ ఇంజినీర్లు సిమ్రన్, సంజయ్ గజ్జల, సాయితేజ అల్లంపెల్లి, న్యూరో సర్జన్లు కలిపి 3డీ కపాలాన్ని రూపొందించనున్నారు. దీనితోపాటు మిక్స్డ్ రియాల్టీ వర్చువల్ హెడ్ సెట్‌ను కూడా తయారు చేస్తారు. దీని ద్వారా న్యూరో సర్జన్లు సులభంగా అర్థం చేసుకునేందుకు, సర్జరీ ప్రాక్టీస్ చేయటానికి అవకాశం కలుగుతుందని ఏఐజీకి చెందిన సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ అభిరామచంద్ర పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

