హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): హైకోర్టులో 36 మంది న్యాయవాదులకు సీనియర్లుగా పదోన్నతి లభించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ఫుల్‌కోర్టు 36 మందికి సీనియర్ న్యాయవాదులుగా పదోన్నతి కల్పించింది. కే రాజిరెడ్డి, సీహెచ్ ప్రతాప్‌రెడ్డి, బీ నళినీకుమార్, సునీల్ గణు, నందిగం కృష్ణారావు, ఎంఎస్ శ్రీనివాస్ అయ్యంగార్, బీ నర్సింహశర్మ, వీఆర్ ఆవుల, పీ శివకుమార్, జీ కనకయ్య, శ్రీపాద ప్రభాకర్, కేవీ భానుప్రసాద్, హెచ్ వేణుగోపాల్, ఎం విజయ్, వై పద్మావతి, వీ భాస్కర్‌రెడ్డి, అంబడిపూడి సత్యనారాయణ, అశోక్ రాంకుమార్, బ్రహ్మదండి రమేశ్, జీ రవిమోహన్, కిశోర్రాజ్ సోహ్ని, పీ రాజాశ్రీపతిరావు, హరీందర్ పరిషత్, ఏ వెంకటేశ్, వీ రఘునాథ్, జీ శివ, ఏ రవీందర్, ఉన్నం మురళీధర్‌రావు, ఎస్ శ్రీనివాస్, సోఫియా బేగం, విక్రం పీ, డీ వెంకట్‌రెడ్డి, అవినాశ్ దేశాయ్, బీ మయూర్‌రెడ్డి, బీ రచనారెడ్డి, జీ సీవీ కృష్ణకు సీనియర్ హోదా కల్పిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీచేశారు.