తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ (Toopran) వద్ద పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్‌లో ఉండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ ఊడిపోయింది. దీంతో అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 35 మంది ప్రయాణికులతో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్నది. ఈ క్రమంలో తుప్రాన్ సమీపంలో హల్దీ వాగు దాటిన తర్వాత బస్సు నుంచి ముందు చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. దీంతో పక్కనున్న డివైడర్‌ను ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ ప్రయాణికులను అత్యవసర చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.