Gold Stolen | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ దొంగతనం.. 30 తులాల బంగారం చోరీ
Gold Stolen | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసుకున్న దుండగులు ఇంటి యజమానులు బయటకు వెళ్లి తిరిగి వచ్చేలోపు బీరువాలో ఉన్న బంగారు నగలు అపహరించారు.
Gold Stolen | వినాయక్ నగర్, సెప్టెంబర్ 23 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసుకున్న దుండగులు ఇంటి యజమానులు బయటకు వెళ్లి తిరిగి వచ్చేలోపు బీరువాలో ఉన్న బంగారు నగలు అపహరించారు. నాగారం ప్రాంతంలోని బ్రాహ్మణ కాలనీలో నివాసం ఉండే పవన్ శర్మ అనే వ్యక్తి సోమవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి పూజలు చేసేందుకు బయటకు వెళ్ళాడు. రాత్రి ఆయన తిరిగి వచ్చేలోపు ఇంటి తాళం ధ్వంసం చేసి ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడంతో అనుమానం కలిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇంట్లోని బీరువా ధ్వంసం చేసి ఉండడంతో అందులో ఉన్న 30 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లుగా బాధితుడు పోలీసులతో తెలిపాడు. చోరీ జరిగిన తీరును పరిశీలించిన సీఐ ఆధారాలు సేకరించేందుకు క్లూస్ టీం ను రప్పించారు. చోరీ విషయం తెలియడంతో నిజామాబాద్ సిసిఎస్ ఎసిపి నాగేంద్ర చారి ఘటనా స్థలానికి వెళ్లి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఐదవ తాన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
ఐదు రోజుల వ్యవధిలో రెండు భారీ చోరీలు..
నగరంలోని ఐదవటానికి పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఐదు రోజుల వ్యవధిలో రెండు భారీ చోరీలు జరగడం పోలీసులకు సవాలుగా మారినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈనెల 18వ తేదీన బాబన్ సహా పహాడి ప్రాంతంలోని ఓ ఇంట్లో సైతం దుండగులు కిటికీ గ్రిల్ తొలగించి ఇంట్లోని పది తులాల బంగారు నగలతో పాటు సుమారు పది లక్షల వరకు కరెన్సీ నోట్లు ఎత్తుకుపోయిన విషయం తెలిసిందే. ఐదు రోజుల క్రితం జరిగిన చోరీలో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపినప్పటికీ అందులో ఇంకా ఎలాంటి పురోగతి రాలేద సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

