హైదరాబాద్ : బతుకుదెరువు కోసం వెళ్లిన ఓ యువకుడికి భారీ లాటరీ తగిలింది. ప్రతి రూపాయి కోసం నిత్యం కష్టపడే ఆ యువకుడి జీవితాన్ని ఆ ఒక్క లాటరీ మార్చేసింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు.
జగిత్యాల యువకుడికి దుబాయ్‌లో రూ. 30 కోట్ల లాటరీ తగిలింది. అజయ్ స్వగ్రామం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు. దుబాయ్‌లోని ఓ కంపెనీలో అజయ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 30 దిర్హమ్స్‌తో రెండు లాటరీ టికెట్లను కొన్నాడు అజయ్. రూ. 30 కోట్ల లాటరీ తగలడంతో అజయ్ సంతోషంలో మునిగిపోయాడు.