హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలకేంద్రానికి 30 పడకల దవాఖానను మంజూరు చేసింది. ఇందుకు రూ.10.70 కోట్ల నిధులను కేటాయించింది. ఆదివాసీలు, గిరిజనులకు తక్షణ వైద్యసహాయాన్ని అందించేందుకు ఈ చర్యలు చేపట్టింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని 30 పడకల దవాఖానను 100 పడకల దవాఖానగా అప్‌గ్రేడ్ చేసింది. దవాఖానకు అవసరమయ్యే పరికరాల కొనుగోలు, సివిల్ వర్క్స్ చేపట్టేందుకు రూ.26 కోట్లను కేటాయించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ మంగళవారం రెండు వేర్వేరు జీవోలను జారీచేశారు.