మహదేవపూర్, ఆగస్టు 14: జయశంకర్ భూ పాలపల్లి జిల్లా మహదేవపూర్ ప్రభుత్వ బాలు ర ఉన్నత పాఠశాలలో జాతీయ జెండా ఏర్పాట్లలో గురువారం అపశ్రుతి చోటుచేసుకున్న ది. అటెండర్ నవీన్ విద్యార్థులు బీ శ్రీరాం (8వ), సుంకరి నవనీత్(8వ), రాంచరణ్ (6వ తరగతి)తో కలిసి జాతీయ జెండాను అలంకరణ కోసం భవనంపై నుంచి తీసుకొస్తుండగా పక్కనే ఉన్న మెయిన్ విద్యుత్తు తీ గలు తగిలి షాక్కు గురయ్యారు. దీంతో నలుగురు మెట్లపై పడటంతో స్పల్పగాయాలయ్యా యి. జిల్లా కేంద్రంలోని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్నవారిని విద్యార్థి సంఘాల నాయకులు పరామర్శించారు.