నల్లగొండ : డ్రంకన్ డ్రైవ్ కేసులో ముగ్గురికి నల్లగొండ కోర్టు జైలుశిక్ష విధించిందని ట్రాఫిక్ సీఐ చీర్ల శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులను బుధవారం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టు ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష, జరిమానా, మరో వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించిందని పేర్కొన్నారు. ఐదుగురు వ్యక్తులకు రూ.7వేల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ వివరించారు.