లోక్‌అదాలత్ ద్వారా 3.30 లక్షల కేసుల పరిషారం
రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌కు అనూహ్య స్పందన లభించింది. ఒక్కరోజే 3,30,866 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.255.48 కోట్ల పరిహారం చెల్లింపునకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌కు అనూహ్య స్పందన లభించింది. ఒక్కరోజే 3,30,866 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.255.48 కోట్ల పరిహారం చెల్లింపునకు ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ పొనుగోటి నవీన్‌రావు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ వినోద్‌కుమార్ లోక్‌అదాలత్‌ను పర్యవేక్షించారు. హైకోర్టులో నిర్వహించిన లోక్‌అదాలత్ ద్వారా 365 కేసులు పరిషారమయ్యాయి. న్యాయమూర్తులు జస్టిస్ అనుపమాచక్రవర్తి, జస్టిస్ శ్రీదేవి, మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీతాపతి లోక్‌అదాలత్ నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

