హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తేతెలంగాణ): తిరుమల వేంకటేశ్వరస్వామికి ఓ భక్తురాలు రూ.2కోట్ల విలువైన బంగారు ఆభరణాన్ని కానుకగా సమర్పించారు. టీటీడీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులనాయుడు మనుమరాలు చైతన్య శ్రీవారికి స్వర్ణ వైజయంతీమాలను టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు చేతుల మీదుగా సమర్పించారు.
ఈ స్వర్ణమాలను ఉత్సవమూర్తులకు అలంకరించనున్నట్టు టీటీడీ చైర్మన్ పేరొన్నారు. మరో స్వర్ణ వైజయంతీమాలను తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని శుక్రవారం దర్శించుకుని దేవస్థానానికి అందించనున్నట్టు చైతన్య తెలిపారు.