హైదరాబాద్, జూన్21 (నమస్తే తెలంగాణ): పీజీ వైద్య, దంత కాలేజీలలో ఫీజుల వ్యవహారంపై వేర్వేరుగా దాఖలైన కేసులపై ఈ నెల 28న విచారణ చేపడుతామని హైకోర్టు ప్రకటించింది. టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన మేరకే ఫీజుల వసూళ్లు చేయాలని, అంతకంటే ఎకువ ఫీజులు వసూలు చేస్తే ఆ మొత్తాన్ని విద్యార్థులకు తిరిగి చెల్లించాలని గత ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కాలేజీ యాజమాన్యాలు అమలు చేయడం లేదంటూ పలువురు విద్యార్థులు కోర్టు ధికార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 28న విచారణ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిన్ ఎన్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.