హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను ఇస్తూ సీఈవో వికాస్‌రాజ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల్లో పనిచేసే వారు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పని వేళల్లో వెసులుబాటు కల్పించాలని ఆయా సంస్థలకు సూచించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.