హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : పీజీ లా కోర్సు అయిన ఎల్ఎల్ఎంలో మరో 277 సీట్లు భర్తీ అయ్యాయి. రెండో విడత కౌన్సెలింగ్లో 282 సీట్లకు 277 సీట్లు భర్తీకాగా, 5 సీట్లు మిగిలినట్టు ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. తొలి విడతలో 915 మంది సీట్లు దక్కించుకోగా, 724 మంది రిపోర్ట్చేశారు.