హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ఆకాంక్షించిన ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగస్వామ్యం అవుతామని రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్ ఆకుల సంజయ్‌రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని ఫార్మసీ కౌన్సిల్ రాష్ట్ర కార్యాలయంలో 25 మంది ఫార్మసీ అధ్యాపకులకు ‘ఉత్తమ ఫార్మసీ ఉపాధ్యాయ అవార్డులు అం దజేసి, సన్మానించారు. త్వరలో డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని సంజయ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నైపర్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రఘురామరావు, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ జేడీ రామ్ధాను, కౌన్సిల్ రిజిస్ట్రార్ యోగానందం, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సభ్యులు చంద్రశేఖర్ ఆజాద్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.