హిమాయత్‌నగర్, జూన్ 23: లైంగిక దాడికి గురై న నాగర్‌కర్నూల్ జిల్లా మొలచింతలపల్లి గ్రామానికి చెందిన చెంచు మహిళ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధిత మహిళకు ప్రభుత్వ ఉద్యోగం, భూమి ఇవ్వాలని కోరారు. దాడి ఘటనపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇసుక మాఫి యా గూండాలు ఆ మహిళపై లైంగిక దాడి చేసి హ త్య చేసేందుకు యత్నించారని, ఈ ఘటనను తీవ్రం గా ఖండిస్తున్నామని తెలిపారు. చెంచులపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి విచారించాలని కోరారు. సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు ప్రసాద్, సుధాకర్, వీరన్న, శివుడు, రమేశ్ పాల్గొన్నారు.