నయీంనగర్, డిసెంబర్12: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24 గంటల పాటు ఏకబిగిన పాఠం చెప్పారు హనుమకొండకు చెందిన ప్రియాంక. దీంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ఆమె సొంతమైంది. ఎం ఫార్మసీ పూర్తిచేసిన ప్రియాంక ప్రస్తుతం ప్రముఖ ఫార్మా కంపెనీ లీడ్ సీడీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఫార్మా రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్న తరాల వారికి తెలియజేయాలన్న సంకల్పంతో విశ్వంభర ఎడ్యుకేషనల్ సొసైటీ, ఆస్పైర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడానికి 24 గంటల పాటు ‘సన్ రైజ్ టు సన్ రైజ్’ పేరుతో మారథాన్ లెక్చర్ ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభించి సోమవారం ఉదయం 9.30 గంటలకు వరకు నిర్విరామంగా కొనసాగించారు.