హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖలో పలువురు అధికారులకు ఉద్యోగోన్నతులు, స్థానచలనం కల్పించారు. వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 24 మంది డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు(డిప్యూటీ సీఈవో) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా(సీఈవో)ఉద్యోగోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 ప్యానెల్ ఇయర్‌కు అడ్హాక్ ప్రాతిపదికన ఈ ఉద్యోగోన్నతులు కల్పించారు.
ఉద్యోగోన్నతి పొందిన అధికారులను వివిధ జిల్లాల జిల్లా ప్రజాపరిషత్ (జడ్పీపీ) సీఈవోలుగా, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్లుగా నియమించారు. ఉద్యోగోన్నతులతోపాటు కొందరు అధికారులను కూడా బదిలీ చేశారు. ములుగు డీఆర్డీవోగా పనిచేస్తున్న ఎం శ్రీనివాసరావును హనుమకొండ జిల్లా డిప్యూటీ సీఈవోగా నియమించారు. జనగామ జడ్పీపీ సీఈవోగా పనిచేస్తున్న మాధురి కిరణ్ చంద్రషాను టీజీ సెర్ప్‌నకు బదిలీ చేశారు. నియమితులైన అధికారులందరూ తక్షణమే తమ కొత్త బాధ్యతలు స్వీకరించాలని సంజయ్‌కుమార్ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.