హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల గడువు ముగియగా, 2,236 దరఖాస్తులు వచ్చాయి.
ఈ విద్యాసంవత్సరం నుంచే కళాశాలల ఏర్పాటుతోపాటు, తరగతులను ప్రారంభించాలని ఇటీవలే నిర్ణయించారు. త్వరలో విద్యార్థుల మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు.