తాండూరు, మే 27 : తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనుమ తులు లేని ప్లాట్లకు అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. నిబం ధనలకు విరుద్ధంగా ఈ నెల 12 నుంచి 18 వరకు ఏడు రోజుల్లోనే 220 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. అంతకుముందు ఏప్రిల్ 22 నుంచి మే 9 వరకు వందకు పైగా జరిగినట్లు తెలిసింది. సాధారణంగా ప్రతిరోజూ 8 నుంచి 12 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగేవి. తాం డూరు పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సాయికుమార్ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఏప్రిల్ 22 నుంచి మే 18 వరకు సాయికుమార్ వివాహం కోసం సెలవులో ఉన్నారు.
కాగా, ఏప్రిల్ 22 నుం చి మే 9 వరకు వికారాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచే స్తున్న పవన్ తాండూరు ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతల్లో కొనసాగారు. ఈయన తన సోదరుడి వివాహమంటూ నెల రోజులపాటు సెలవు పెట్టా రు. దీంతో, చంపాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే ఫసియుద్దీన్ మే 12 నుంచి 18 వరకు తాండూరు ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు నిబంధనలకు విరుద్ధంగా డీటీసీపీ లేని లేఅవుట్లలోని 220 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు. ఏ రోజు రిజిస్ట్రేషన్ జరిగితే అదే రోజు డాక్యుమెంట్లను స్కానింగ్ పూర్తి చేయాలి. అయితే, పెద్ద ఎత్తున డాక్యుమెంట్ల స్కానింగ్ పెండింగ్‌లో ఉండడం.. సెలవుల్లో ఉన్న ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ సాయికుమార్ విధుల్లో చేరడంతో నిబంధనలకు విరుద్ధంగా చేసిన ప్లాట్ల విషయం బయటప డింది.
ఫసియుద్దీన్ అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగేందుకు సహకరించినట్లు ఆరోపణలు రావడం తో ఉన్నతాధికారులు అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారంలో కొందరు డాక్యుమెంట్ రైటర్లు కీలక పాత్ర పోషించినట్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయడంలో ఇంకా ఎవ రెవరూ ఉన్నారో తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించినట్లు సమాచారం. తాండూరులో అనుమతి లేని లే అవుట్లు, అక్రమ నిర్మాణాలున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపో వడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.