హైదరాబాద్, జూలై 26: కొండెక్కిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయంగా డిమాండ్ పడిపోవడంతో కొనుగోలుదారులు వెనుకంజ వేయడంతో దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడోరోజూ శనివారం కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పద్రిగాముల పుత్తడి ధర రూ.550 తగ్గి లక్ష రూపాయల దిగువకు రూ.99,930కి చేరుకున్నది.
అంతకుముందు ఇది రూ.1,00,480గా ఉన్నది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 22 క్యారెట్ బంగారం తులం ధర రూ.400 దిగొచ్చి రూ.91,600గా నమోదైంది. బంగారంతోపాటు వెండి భారీగా తగ్గింది. పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి రూ.2 వేలు తగ్గి రూ.1.26 లక్షలకు దిగొచ్చింది.