హైదరాబాద్, జూన్ 18(నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భా గంగా ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక దివస్ను ఘనంగా నిర్వహించనున్నట్టు ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ తెలిపారు. మామిడి తోరణాలు, పూ లు, విద్యుత్తు దీపాలతో ఆలయాలను అలంకరించడంతోపాటు అభిషేకాలు, హో మాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తిగా సీఎం కేసీఆర్ యాదాద్రిని తెలంగాణ తిరుపతిగా తీర్చిద్దారని, అనేక ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ధూప దీప నైవేద్య అర్చకుల వేతనాలను రూ.6,000 నుంచి రూ.10,000 లకు పెంచడంతోపాటు ఈ పథకాన్ని మరో 2,047 ఆలయాలకు విస్తరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.