హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి సేవా పతకాలను ప్రకటించింది. ఈ పతకాల్లో సీబీఐకి చెందిన 21 మంది అధికారులు ‘ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్‌లోని ఆరుగురు అధికారులు, పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ మెడల్‌కు 15 అధికారులు ఎంపికయ్యారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన అడిషనల్ ఎస్పీ చిలుకూరి వెంకట నరేంద్రదేవ్కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ మెడల్‌ను ప్రదానం చేయనున్నారు. ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ పురస్కారాలు అందుకునే వారిలో సీబీఐ డీఐజీ వివేక్ ప్రియదర్శి (న్యూఢిల్లీ), డీఐజీ మచింద్ర రామచంద్ర కడోల్ (కోల్‌కతా), అడిషనల్ ఎస్పీ చిలుకూరి వెంకటనరేంద్రదేవ్ (హైదరాబాద్), అడిషనల్ ఎస్పీ బండిరెడ్డి రాజు (న్యూఢిల్లీ), డీఎస్పీ విశాల్ (న్యూఢిల్లీ), హెడ్‌కానిస్టేబుల్ అభిజిత్‌సేన్ (కోల్‌కతా) ఉన్నారు.