గురువారం 02 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 21:04:21

జీహెచ్‌ఎంసీ మేయర్‌ కారు డ్రైవర్‌కి కరోనా

జీహెచ్‌ఎంసీ మేయర్‌ కారు డ్రైవర్‌కి కరోనా

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మేయర్‌ సహా ఆయన కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో మేయర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.  మొన్న జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ప్రధాన కార్యాలయంలో అందరికీ కరోనా పరీక్షలు చేశారు. ఇందులో కొందరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అందులో మేయర్‌ డ్రైవర్‌ కూడా ఉన్నారు. ఈ క్రమంలో మేయర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతుంది.  

మరోవైపు, మేయర్‌ రోజూ యథావిధిగా నగరంలో పర్యటిస్తున్నారు. గురువారం కూడా మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. మల్కాజ్‌గిరి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, స్థానిక  కార్పొరేటర్లు, అధికారులు,పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, ఎల్బీనగర్‌ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. 


logo