శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 05, 2020 , 18:18:30

కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మల్యే డాక్టర్‌ ఆనంద్‌

కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మల్యే డాక్టర్‌ ఆనంద్‌

వికారాబాద్‌ : స్థానిక అంబెద్కర్‌ భవన్‌లో వికారాబాద్‌ ఎమ్మల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఆడపిల్లల వివాహాలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. లక్షా నూట పదహార్లు అందిస్తుందన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో అందరూ నిభందనలు పాటిస్తూ కరోనా భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మొత్తం 14 మందికి ఎమ్మల్యే చెక్కులు పంపిణీ చేశారు. 


logo