శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jan 24, 2020 , 18:09:17

పట్టు పరిశ్రమకు మంచి డిమాండ్‌ ఉంది: మంత్రి హరీశ్‌రావు

పట్టు పరిశ్రమకు మంచి డిమాండ్‌ ఉంది: మంత్రి హరీశ్‌రావు

లక్షకు పైగా ఆదాయం సెరి కల్చర్ రైతులకు వస్తుంది. 3 ఎకరాల్లో 5 లక్షల ఆదాయం వస్తుంది. మల్బరీ చెట్టు పెడితే 15 ఏళ్లు ఉంటుంది. గూగుల్, మైక్రో సాఫ్ట్ ఉద్యోగాల కన్నా ఆరోగ్యం, ఆదాయం వస్తుంది. ఈ ఉద్యోగాలకు టాక్స్ కట్టాలి. రైతు ఏ టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా 30 వేల ఎకరాల్లో సాగు చేసే పరిస్థితి ఉంది. భూమి ఉన్న యువత ఈ రంగం వైపు రావాలి. తెలంగాణ ఈ యేడాది 3 రెయిలింగ్ యూనిట్లు ఇస్తామని చెప్పినట్లు, మార్కెట్ బలోపేతం అవుతుంది. ఒక కిలో రానున్న రోజుల్లో 500 రూపాయలకు ధర ఉండవచ్చని చెబుతున్నారు.

సిద్దిపేట కాటన్‌ మార్కెట్‌లో పట్టు రైతుల సమ్మెళనం జరిగింది. కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు, వ్యవసాయశాఖ కమిషనర్‌ పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ... పట్టు పరిశోధనకు సిద్దిపేట వేదికగా మారింది. పట్టు పరిశ్రమలో రైతులకు మంచి లాభాలు ఉంటాయని తెలిపారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... ఇది రైతు ప్రభుత్వం. సీఏం కేసీఆర్ రైతు బాంధవుడు. మిషన్ కాకతీయ పథకం తెచ్చి చెరువులను బాగు చేయించాం. కాళేశ్వరం, సీతారామ లాంటి భారీ ప్రాజెక్టులు తెచ్చి రైతులకు సాగు నీరు అందిస్తున్నాం. వేయి కోట్లతో మండలానికి గోదాములు, ఉచిత విద్యుత్, పంటలకు మద్దతు ధర, వ్యవసాయ పని ముట్లు, ట్రాక్టర్లను తెలంగాణ ప్రభుత్వం అందించింది.  కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు బడ్జెట్‌లో 30శాతం నిధులు కేటాయించింది. 


వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు డైరీ, గొర్రెలు, యూనిట్లను ప్రోత్సహించింది. రైతులకు నీళ్లు వచ్చాయి. ఇక ఆదాయం రావాలి.  భారత దేశంలో అవసరమైన పట్టు ఉత్పత్తి తక్కువ. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. విదేశీ మాదక ద్రవ్యం కూడా దేశానికి భారం. తెలంగాణ రాష్టం ఏర్పాటయ్యే ముందు 4 వేల ఎకరాల్లో పట్టు సాగు వచ్చింది. కానీ తెలంగాణ వచ్చాక 11 వేలకు పెరిగింది. ఇంకా పెరగాలి. 25 రూపాయల రాయితీని ప్రభుత్వం 75 రూపాయలకు చేసింది. రాయితీలు పంచాయతీ రాజ్ శాఖ వారితో మాట్లాడి ఈజీఎస్ కింద మద్దతు పొందాలి. సకాలంలో డబ్బులు విడుదల చేసి అమ్మెలా చర్యలు తీసుకుంటాం.  మంచిగా శ్రద్ధపెట్టి చేసుకున్న రైతుకు పట్టు పరిశ్రమ వల్ల ఎకరాకు రూ.లక్ష లాభం వస్తుంది. ఆదర్శ రైతుల మాటల్లో లాభసాటి వ్యవసాయం కనిపిస్తున్నది. పట్టు పరిశ్రమకు ప్రపంచంలో మంచి డిమాండ్‌ ఉందని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది. విదేశీ మాదక ద్రవ్యం మిగులుతుంది.


లక్షకు పైగా ఆదాయం సెరి కల్చర్ రైతులకు వస్తుంది. 3 ఎకరాల్లో 5 లక్షల ఆదాయం వస్తుంది. మల్బరీ చెట్టు పెడితే 15 ఏళ్లు ఉంటుంది. గూగుల్, మైక్రో సాఫ్ట్ ఉద్యోగాల కన్నా ఆరోగ్యం, ఆదాయం వస్తుంది. ఈ ఉద్యోగాలకు టాక్స్ కట్టాలి. రైతు ఏ టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా 30 వేల ఎకరాల్లో సాగు చేసే పరిస్థితి ఉంది. భూమి ఉన్న యువత ఈ రంగం వైపు రావాలి. తెలంగాణ ఈ యేడాది 3 రెయిలింగ్ యూనిట్లు ఇస్తామని చెప్పినట్లు, మార్కెట్ బలోపేతం అవుతుంది. ఒక కిలో రానున్న రోజుల్లో 500 రూపాయలకు ధర ఉండవచ్చని చెబుతున్నారు. చైనా నుంచి ప్రపంచ దేశాలు దిగుమతి చేసుకుంటే.. అక్కడ లేబర్ కాస్ట్ పెరిగింది. మనకు ఆ అవకాశం రావాలి. కర్ణాటక రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో సాగు చేస్తుంది. మనం 11 వేల ఎకరాల్లో మాత్రమె చేస్తున్నాం. మనమంతా వరి, పత్తి పంటల పైనే దృష్టి పెడుతున్నామని, కానీ ఆదాయం మాత్రం 30 వేలు మాత్రమె ఉంటున్నదని, కానీ సెరి కల్చర్ వెళితే 3 లక్షల ఆదాయం వస్తుంది. యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.


logo