స్టేషన్‌ఘన్‌పూర్, ఆగస్టు 31 : జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎన్పీడీసీఎల్ డీఈ రూ.20 వేలు లంచం తీసుకుంటూ శనివారం రాత్రి ఏసీబీకి పట్టుబడ్డాడు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన కుంబం ఎల్లయ్య పొలం నుంచి విద్యు త్తు లైన్లు మార్చాలని, టవర్ల ఏర్పాటుకు రూ. 16 లక్షలతో డీడీ తీశాడు.
నెలక్రితమే టవర్లను ఏర్పాటు చేశారు. ఎల్లయ్య రూ.20 వేలు ఇవ్వా ల్సి ఉందని, వైర్లు లాగొద్దని డీఈ హుస్సేన్‌నాయక్ కాంట్రాక్టర్‌ను ఆదేశించాడు. దీంతో ఆ 20 వేలు డీఈకి ఇచ్చేందుకు అంగీకరించాడు. ఎల్లయ్య కొడుకు రాజు డీఈకి రూ.20 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
జనవరి 18న నవోదయ ఎంట్రెన్స్
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): జవహార్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. 19లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 2025 జనవరి 18న ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. దరఖాస్తు చేసుకునేవారు 2013 మే 1 నుంచి 2015 జూలై 31 మధ్యకాలంలో పుట్టినవారై ఉండాలి.
ఎడ్‌సెట్‌లో 9,817 మందికి సీట్లు
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల బీఈడీ కోర్సులో మొదటి విడత సీట్లను శనివారం కేటాయించారు. 14,211 సీట్లుండగా, తొలివిడత కౌన్సెలింగ్‌లో 9,817 సీట్లు భర్తీ అయ్యాయి.