మరో 20 కేజీబీవీల మంజూరు
రాష్ట్రంలో కొత్తగా మరో 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు( కేజీబీవీ) మంజూరయ్యాయి. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ జీవో 24ను విడుదల చేసింది.
- కొత్త మండలాల్లో ఏర్పాటు
- విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
- మొత్తం 495కి చేరిన విద్యాలయాలు
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా మరో 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు( కేజీబీవీ) మంజూరయ్యాయి. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ జీవో 24ను విడుదల చేసింది. వీటి నిర్వహణకు రికరింగ్ బడ్జెట్‌గా రూ.60 లక్షలను కూడా మంజూరు చేసింది. అణగారిన వర్గాలకు చెందిన బాలికలను అక్కున చేర్చుకొని.. చక్కటి చదువులందిస్తున్న కేజీబీవీలను ఆయా కొత్త మండలాల్లో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం లభించింది. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో 2014లో 391 కేజీబీవీలుండేవి. 2017-18లో మరో 84 కేజీబీవీలను మంజూరుచేశారు. తాజాగా 20 కేజీబీవీలు ఏర్పాటు చేయగా, వాటి సంఖ్య 495కి చేరింది. 245 కేజీబీవీల్లో ఇంటర్ విద్య, మరో 230 కేజీబీవీల్లో పదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు.
కొత్తగా ఏర్పాటు చేసినవి ఇవే..
మావల (ఆదిలాబాద్), బీర్పూర్, బుగ్గారం (జగిత్యాల), కొత్తపల్లి, గన్నేరువరం (కరీంనగర్), దంతాలపల్లి (మహబూబాబాద్), మహ్మదాబాద్ (మహబూబ్‌నగర్), నార్సింగి, నిజాంపేట, హవేలి ఘన్పూర్ (మెదక్), నిజామాబాద్ (సౌత్), నిజామాబాద్ (నార్త్), నాగలిగిద్ద, మెగ్గుంపల్లి, వట్పల్లి, గుమ్మడిదల, చౌటకూరు (సంగారెడ్డి), దూల్మిట్ట (సిద్దిపేట), చౌడాపూర్ (వికారాబాద్)లలో కొత్తగా కేజీబీవీలను ఏర్పాటు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

