మంచిర్యాల: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయంలోకి 1,53,324 క్యూసెక్కుల నీరు వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో అంతేమొత్తంలో నీటిని వదులుతున్నారు. శ్రీపాదసాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు. ప్రస్తుతం 19.425 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.