నీలగిరి, అక్టోబర్ 22: తమ భర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న 12వ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు సోమవారం ఆందోళనకు దిగారు. అధికారులు వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాల్సింది పోయి ఆందోళన చేసిన వారి భర్తలను మంగళవారం సస్పెండ్ చేశారు. బెటాలియన్ ఉన్నతాధికారులు ధర్నాలో పాల్గొన్న వారిని గుర్తించి.. కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న 20 మందిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తున్నట్టు మౌఖికంగా చెప్పిన అధికారులు వారికి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ విషయమై వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే.. బెటాలియన్ కమాండెంట్ సత్యశ్రీనివాస్రావు స్పందించలేదు.